Bimbisara Part 2 : చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. మొదటి వారం లోపే సినిమాకి పెట్టిన బడ్జెట్ కలెక్షన్ల రూపంలో వచ్చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో నిర్మించగా వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు.
గతంలోనే ఈ సినిమాకి పార్ట్ 2 ,3 కూడా ఉంటుందని ప్రకటించారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్నారు. వరుసగా సక్సెస్ మీట్ లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బింబిసార పార్ట్ 2 స్టోరీ రివీల్ చేసేశాడు కళ్యాణ్ రామ్.
Shahrukh Khan in Laal Singh Chaddha : లాల్ సింగ్ చడ్డాలో షారుఖ్.. సీక్రెట్ బయటపెట్టేసిన అమీర్..
పార్ట్ 2 లో.. అసలు బింబిసారుడు ఎవరు? తన తమ్ముడిని ఎందుకు చంపాలి అనుకున్నాడు? బింబిసార విలన్‌గా మారడానికి కారణం ఏంటి? తన చిన్నప్పటి జీవితం గురించి ఉంటుందని చెప్పాడు. ఈ స్టోరీ లైన్ మీదే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది అని తెలిపాడు. ‘బింబిసార-2′ మరింత విజువల్ గ్రాండియర్‌గా ఉండబోతుంది అని కూడా చెప్పడంతో ఇప్పట్నుంచే పార్ట్-2 పై ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి.