Tokyo Olympics : కమల్ ప్రీత్ సంచలనం..డిస్కస్ త్రోలో ఫైనల్‌కు అర్హత

భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. డిస్కస్ త్రోలో భారత సంచలనం కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ పతకాల లిస్టులో మరొకటి చేరనుంది. డిస్కస్ త్రోలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధించినట్టే. కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో సరిగ్గా అంతేదూరం విసిరి ఫైనల్‌కు చేరింది.

Kamalpreet Kaur reach finals : టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు ప్రతిభ చాటుతున్నారు. దేశానికి పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే మీరాభాయా ఛాను సిల్వర్ పతకం సాధించి పతకాల పట్టికకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. డిస్కస్ త్రోలో భారత సంచలనం కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ పతకాల లిస్టులో మరొకటి చేరనుంది. డిస్కస్ త్రోలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధించినట్టే. కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో సరిగ్గా అంతేదూరం విసిరి ఫైనల్‌కు చేరింది.

మొత్తం మూడు రౌండ్ల పాటు జరిగిన డిస్కస్ త్రోలో తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీటర్లు విసిరి ఫైనల్ కు అర్హత సాధించింది. కాగా..అమెరికా క్రీడాకారిణి అమ్న్ వలరీ తొలి స్థానంలో నిలవగా, భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి 12 స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు ఎంపిక అవుతారనే విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసే సరికి 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ పోరులో గెలిస్తే భారత జట్టు గెలవడంతోపాటు, బ్రిటన్-ఐర్లాండ్ మధ్య జరిగే పోరులో ఐర్లండ్ ఓటమి పాలైతే భారత జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు