Kanatara Movie Collects 400 crores and still running
Kantara : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబేలె ఫిలిమ్స్ నిర్మాణంలో రివెంజ్, దైవం కాన్సెప్ట్ తో తెరకెక్కిన కన్నడ సినిమా కాంతార భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడలోనే కాకుండా భారతదేశంతో పాటు వేరే దేశాల్లో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా రిలిజ్ అయి భారీ విజయాన్ని మూటకట్టుకుంది. మొదటి నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
Ayushmann Khurrana : ఆ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతున్నా.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..
తాజాగా కాంతార సినిమా మరో రేర్ ఫీట్ ని సాధించి రికార్డ్ సృష్టించింది. కాంతార సినిమా ఇప్పటికి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. విడుదలై 50 రోజులు అవుతున్నా థియేటర్లలో క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. కాంతార సినిమా కర్ణాటకలో రూ.168.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు, బాలీవుడ్ లో రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా థియేటర్స్ లో ఇంకా నడుస్తుండటంతో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో అంతా చిత్ర యూనిట్ ని మరోసారి అభినందిస్తున్నారు,.