RAPO19: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకుని.. క్లాస్, మాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ ఇప్పుడు కేవలం తెలుగుతో పాటు దక్షణాది భాషలపై కన్నేసి సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా.. రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ సరసన మరో టాలెంటెడ్ కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తోంది. అక్షర నటిస్తోందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా అక్షర గౌడ్ ప్రస్తుతం షూటింగ్ లో కూడా పాల్గొంటోందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న హీరో ఆది సరసనే అక్షర గౌడ నటిస్తుందని తెలుస్తుంది. అక్షర పాత్ర చాల పవర్ ఫుల్ గా .. పల్నాటి నాగమ్మ పాత్రను పోలి ఉంటుందట.
కాగా, హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమా కోసం బోల్డ్ గా కనిపించనుందని ఇప్పటికే సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుండగా.. కృతి శెట్టిది ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ రోల్ అట. మరి మొదటిసారి కృతి గ్లామర్ గా కనిపిస్తోంది కాబట్టి ఈ సినిమాకి ఆమె అందం బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కాగా, అక్షర ఇప్పటికే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. అక్షరకు కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ, తెలుగు బాషలలో తెరకెక్కే ఈ సినిమా కోసం అటు కన్నడ స్టార్స్ ను కూడా కలపడం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో.. రామ్, లింగుస్వామికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.
N this is an exciting one ?❤️
Watch this space .. #Grateful #RAPO19
Ustaad @ramsayz @dirlingusamy @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli
and my co-star @AadhiOfficial https://t.co/3pvGoViCtf— Akshara Gowda Bikki (@iAksharaGowda) July 31, 2021