Kantara: కర్ణాటకలో ‘కాంతార’ సెన్సేషనల్ రికార్డు.. ఏకంగా కోటి టికెట్లు!

న్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో రిషబ్ తెరకెక్కించగా, ఈ సినిమాలోని కంటెంట్, రిషబ్ వన్ మ్యాన్ షో కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లింది.

Kantara Movie Creates Sensational Record In Karnataka

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో రిషబ్ తెరకెక్కించగా, ఈ సినిమాలోని కంటెంట్, రిషబ్ వన్ మ్యాన్ షో కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లింది. ఈ సినిమాలో తుళునాడు సంప్రదాయానికి సంబంధించిన కొన్ని అంశాలను చాలా చక్కగా ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమాకు కన్నడలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రిషబ్ శెట్టి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళ్లింది. తాజాగా కన్నడలో ఈ సినిమా ఓ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకుంది. కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే ‘కాంతార’ సినిమాకు ఏకంగా 1 కోటి టికెట్లు తెగినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Kantara: కాంతార ఓటీటీ రిలీజ్.. మళ్లీ వాయిదా..?

ఇక కేవలం కన్నడలోనే కాకుండా ఈ సినిమాకు ఇతర భాషల్లోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి తన సత్తా చాటింది. ఇక ఈ సినిమా హిందీ వెర్షెన్‌లోనూ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి.