Karnataka CM : యడియూరప్ప రాజీనామా

కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయన రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలువనున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆయన సీఎం పదవి నుంచి వైదొలగనున్నారు.

Karnataka CM : కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు సమర్పించారు. మొదట సాయంత్రం నాలుగు గంటలకు లేఖను సమర్పిస్తారని వార్తలు వచ్చాయి.. కానీ మధ్యాహ్నం 1 గంటలోపే ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. 2019లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు యడియూరప్ప.. రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి సోమవారం రాజీనామా చేశారు.

గత కొంతకాలంగా యడియూరప్ప రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం వెనుక కారణం కూడా ఇదేనంటూ వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి యడుయూరప్ప స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా కన్నడనాట బీజేపీలో చక్రం తిప్పుతున్న యడుయూరప్ప సోమవారం సీఎం పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్. సంతోష్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. సంఘ్ నేపథ్యం ఉన్న సంతోష్ కర్ణాటక ముఖ్యమంత్రి కానున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం వరకు స్పష్టత రానుంది.

ట్రెండింగ్ వార్తలు