Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్..

‘మహానటి’ సినిమాతో తన కెరీర్‌ను డిఫరెంట్ జోనర్‌వైపు నడిపించింది కీర్తి సురేష్.. నిజానికి ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చినా హీరోయిన్‌గా కెరీర్‌ను కోల్పోవలసి వచ్చింది..

Keerthy Suresh

Keerthy Suresh: హీరోయిన్‌గా కెరీర్ డల్ అయ్యింది అనుకున్న టైమ్‌లోనే మరోసారి కీర్తి సురేష్ కెరీర్ స్పీడ్ అందుకుంది. అన్నీ లేడీ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తుంది అనుకున్న టైమ్‌లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేస్తుంది. అలా అని హీరోయిన్‌గానే కాదు, నచ్చిన పాత్ర చేయడానికి రెడీ అంటోంది.

‘మహానటి’ సినిమాతో తన కెరీర్‌ను డిఫరెంట్ జోనర్‌వైపు నడిపించింది కీర్తి సురేష్. నిజానికి ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చినా హీరోయిన్‌గా కెరీర్‌ను కోల్పోవలసి వచ్చింది. అడపా దడపా కథానాయికగా సినిమాలు చేసినా అవి తనకు ఏమాత్రం బూస్టప్ ఇవ్వలేదు. ఈ మధ్యనే మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది కీర్తి. ఈ సినిమా కోసం వెయిట్ తగ్గి నాజూగ్గా తయారయ్యింది. తనను తాను కొత్తగా మేకవోర్ చేసుకుంది. హీరోయిన్‌గా వరుస అవకాశాలు వచ్చినా.. డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను చేయడం మాననంటోంది.

సూపర్‌స్టార్ రజనీ కాంత్ – శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అన్నాత్తే’ మూవీలో నయనతార మాదిరిగానే కీర్తి సురేష్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది అనుకున్నారు అంతా. కానీ, ఆ తరువాత అదేం కాదు.. రజనీ కాంత్ కూతురిగా కనిపించనుంది అన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ సినిమాలో కీర్తి సురేష్ సూపర్‌స్టార్ చెల్లెలిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. రజనీ కాంత్‌తో నటించే అవకాశం రావడం, అందులోనూ ఈ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చడంతో కీర్తి ‘అన్నాత్తే’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం..