Triple Talaq : సీన్ రివర్స్..తలాక్ చెప్పలేదని భర్తను చితకబాదిన భార్య..

ట్రిపుల్ తలాక్ చెప్పలేదని భర్తను చితకబాదింది భార్య. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అల్లుడిని దారుణంగా కొట్టిన ఘటన కేరళలో జరిగింది.

Kerala Man Beaten By Wife For Refusing To Utter Triple Talaq

Kerala man beaten by wife for refusing to utter triple talaq : ముస్లిం కమ్యూనిటీలో ‘తలాక్’ అని మూడుసార్లు చెబితే చాలు భార్యాభర్తలకు విడాకులు అయిపోయినట్లేనని వారి మతాచారం చెబుతోంది. దీంతో భార్యల్ని వదిలించుకోవాలనుకునే భర్తలు చిన్న చిన్న కారణాలకే ‘తలాక్’అని మూడుసార్లు చెప్పేసి..లేదా పేపర్ మీద రాసేసి..ఇంకా చెప్పాలంటే వాట్సాప్ లో తలాక్ అని మూడుసార్లు రాసి మెసేజ్ చేసి వదిలించుకున్న ఘటనల్ని ఇప్పటివరకు చూశాం. కానీ ఓ మహిళ విషయంలో సీన్ రివర్స్ అయింది. తనకు తలాక్ చెప్పమని భర్తను పదే పదే కోరినా భర్త తనకు తలాక్ చెప్పటంలేదని ఓ భార్య భర్తపై దాడి చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

తలాక్ అని చెప్పలేదని భార్య..ఆమె కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసారు. కేరళకు చెందిన వ్యక్తి తన భార్యనుంచి విడిపోవటం ఇష్టం లేక తలాక్ చెప్పమని భార్య ఎంత ఇబ్బంది పెట్టినా చెప్పలేదు. దీంతో ఆమె నాకు నీతో కలిసి ఉండటం ఇష్టంలేదు తలాక్ చెప్పమంటే చెప్పట్లేదు అంటూ భర్తపై తన పుట్టింటివారితో కలిసి దాడి చేసి దారుణంగా కొట్టిన ఘటన కేరళలోని కొట్టకాల్ లో జరిగింది.

Read more : Triple Talaq: వాట్సప్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పి అయిపోయిందనుకున్నాడు.. కానీ,

ఈ వింత ఘటన వికేరళలోని కొట్టకాల్‌కు చెందిన 30 ఏళ్ల అబ్దుల్ అసీబ్‌కు ఫాతిమా షాహిమా అనే యువతితో నెలన్నర క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఫాతిమా భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకుండానే తన కూతురు పుట్టింటికి వచ్చేయటంతో ఫాతిమా కుటుంబ సభ్యులు అల్లుడి అసీబ్ పై కోపం పెంచుకున్నారు. నీకు మా అమ్మాయి అక్కర్లేకపోతే తలాక్ చెప్పేయమని అడిగారు. ఫాతిమా కూడా తనకు తలాక్ చెప్పేయమని ఎవరి బతుకులు వారు బతుకుదామని భర్తతో చెప్పింది. కానీ దానికి అసీబ్ నేను తలాక్ చెప్పను అని చెప్పాడు.

ఈక్రమంలో ఫాతిమా..ఆమె కుటుంబ సభ్యులు ఓ రోజున అసీబ్ ఉద్యోగం చేసే ఆఫీసుకువెళ్లి మరీ దారుణంగా దాడిచేసి గాయపరిచారు. అంతేకాక ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేయాలని బెదిరించారు. అక్కడితో ఆగక అసీబ్‌ను కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి మళ్లీ చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అసీబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more : ఆడపిల్ల పుట్టిందని ట్రిపుల్ తలాక్

బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై అసీబ్ మాట్లాడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని..నా భార్య పుట్టింట్లోనే ఉందని, ట్రిపుల్ తలాక్ చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు తనను కత్తితో బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఫాతిమా ఆమెకుటుంబ సభ్యుల వెర్షన్ వేరేగా ఉంది. అసీబ్ కు అనుమానం ఎక్కువని..తనను వేధించేవాడనీ..మద్యం తాగే అలవాటు ఉందని ఆ అలవాటుతో తనను వేధించేవాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.