woman photographers india tour : స్కూటీపై మహిళా ఫోటోగ్రాఫర్లు భారత యాత్ర..ఎందుకంటే..

స్కూటీపై ఇద్దరు మహిళా ఫోటోగ్రాఫర్లు భారత యాత్ర చేపట్టారు. దారిలో అనేక మొక్కలు నాటుతూ తమ యాత్రను ఈ ఫోటోగ్రాఫర్‌లిద్దరూ సాగిస్తున్నారు.

Kerala Woman Photographers All India Tour On Scooter (1)

Kerala woman photographers All india tour : కారులోనో లేదా పెద్ద బైక్ మీదనో భారతదేశమంతా యాత్ర చేస్తుంటారు చాలామంది.కానీ ఓ స్కూటర్ మీద భారత యాత్ర చేపట్టారు ఇద్దరు మహిళా ఫోటో గ్రాఫర్లు. కేరళకు చెందిన వీరిద్దరు స్కూటర్‌పై అఖిల భారత యాత్రను చేపట్టారు. ఏదోక కారణం లేకుండా భారత యాత్ర చేయాలనుకోరు కదూ..వీరిద్దరి యాత్రకు కూడా ఓ కారణమే ఉంది.అదే కాలుష్య భూతం. కేవలం భారత్ నే కాదు యావత్ ప్రపంచాన్నే కాలుష్యం వణికిస్తోంది.పలు వ్యాధులకు గురిచేస్తోంది.ఎంతోమంది ప్రాణాలు తీస్తోంది. కాలుష్యం పెరిగిపోతుండటంతో పంటలు కూడా తగ్గిపోతున్న ప్రమాదక స్థితులు కనిపిస్తున్నాయి.

కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇప్పటికే తినే తిండి, తాగే నీరు, నిలబడే నేల ప్రతిదీ కలుషితమైపోయాయి. ఈ క్రమంలోనే ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను యావత్ భారతానికి తెలియజేయాలన్న ధృడ సంకల్పంతో కొచ్చికి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లు 30 ఏళ్ల అనామిహా ఆర్, 40 ఏళ్ల సిమి అగస్టిన్ అనే మహిళా ఫోటో గ్రాఫలిద్దరూ అఖిల భారత యాత్రను చేపట్టారు. సాధారణంగా స్కూటీ మీద రోజంతా ప్రయాణిస్తే నడుము నొప్పులు ఖాయం.అటువంటిది 30,40 ఏళ్ల వయస్సులో మహిళలిద్దరు స్కూటీపై భారత యాత్ర అంటే మాటలుకాదు. కానీ వారి సంకల్పం ముందు వారి ఆరోగ్య సమస్యలు పెద్దవికావనుకున్నారు.

అలా ప్రకృతి పరిరక్షణపై సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్కూటర్‌పై తమ ఆల్-ఇండియా యాత్రను ఆదివారం (నవంబర్ 7,2021) ప్రారంభించారు. ఆల్ కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మద్దతుతో వీరిద్దరూ రెండు నెలల్లో ప్రయాణాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఒక్క సందేశాన్ని పాస్ చేయడమే కాకుండా.. దారిలో అనేక మొక్కలు నాటుతూ తమ యాత్రను ఈ ఫోటోగ్రాఫర్‌లిద్దరూ సాగిస్తున్నారు.