యూట్యూబ్ ఆధిపత్యానికి ముప్పు? : పిల్లలు ‘టిక్‌టాక్’తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు.. కొత్త అధ్యయనం 

  • Publish Date - June 5, 2020 / 01:39 PM IST

సాధారణంగా చాలామంది చిన్నారులకు యూట్యూబ్‌లో వీడియోలు ఎక్కువగా చూడడం అలవాటు. పిల్లల కోసం ప్రత్యేకించి యూట్యూబ్ కిడ్స్ కూడా గూగుల్ అందిస్తోంది. ఇందులో చిన్నారులు ఎక్కువ సమయం వీడియోలను చూస్తుంటారు. ఇప్పటివరకూ ఎదురులేని యూట్యూబ్ ఆధిపత్యానికి ముప్పు వాటిల్లనుందా? చిన్నారులు యూట్యూబ్‌ను వదిలి షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ వాడుతున్నారా? అంటే అవుననే అంటోంది కొత్త అధ్యయనం. గూగుల్ ఆన్ లైన్ వీడియో ప్లాట్ ఫాం సహా ఇతర యాప్స్ టిక్ టాక్, నెట్ ఫ్లిక్స్, మొబైల్ గేమ్స్, Roblox మరిన్నో అందుబాటులో ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి 15 ఏళ్ల చిన్నారులు ఎక్కువగా ఇప్పుడు టిక్ టాక్ తోనే సమయం గడిపేస్తున్నారు. రోజుకు సగటున 85 నిమిషాల పాటు వీక్షిస్తున్నారు. యూట్యూబ్ వీడియోలతో పోలిస్తే టిక్ టాక్‌లో రోజుకు 80 నిమిషాల పాటు వీడియోలను వీక్షిస్తున్నారు. 2019 నాటికి కిడ్స్ సోషల్ యాప్ 100 శాతం యాప్ వృద్ధిని సాధించింది. 
 

2020లో 200 శాతానికి పెరిగినట్టు రిపోర్టు తెలిపింది. ఈ డేటాను డిజిటల్ సేఫ్టీ యాప్ మేకర్ Qustodio వార్షిక నివేదికలో వెల్లడించింది. స్పెయిన్, అమెరికా, యూకేలోని 4 ఏళ్ల వయస్సు నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ఉన్న 60వేల కుటుంబాలపై సర్వే నిర్వహించారు. గ్లోబల్ ట్రెండ్స్‌కు మాత్రం ఈ డేటా సరిపోలదు. ఫిబ్రవరి 2019 నుంచి ఏప్రిల్ 2020 మధ్యకాలంలో పిల్లల ఆన్ లైన్ అలవాట్లపై రీసెర్చ్ నిర్వహించారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రత్యేకించి నాలుగు ప్రధాన విభాగాల (ఆన్ లైన్ వీడియో, సోషల్ మీడియా, వీడియో గేమ్స్, ఎడ్యుకేషన్)కు చెందిన మొబైల్ అప్లికేషన్లపై రీసెర్చర్లు దృష్టిపెట్టారు. నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు చిన్నారులు రోజుకు రెండు సార్లు ఎక్కువగా వీడియోలను చూస్తున్నారు. యూట్యూబ్ యాప్ ను అమెరికాలో 69 శాతం, యూకేలో 74 శాతం పిల్లలు, స్పెయిన్‌లో 88 శాతం మంది ఉన్నారు. చిన్నారుల కోసం ప్రవేశపెట్టిన యూట్యూబ్ కిడ్స్ యాప్ ను అమెరికాలో 7 శాతం మాత్రమే వాడుతున్నారు. యూకేలో 10 శాతంగా ఉన్నారు. స్పెయిన్ లో మాత్రం సరైన డేటా లేదు. 

యూట్యూబ్ కిడ్స్ తర్వాత మరో అతిపెద్ద యాప్.. ఆన్ లైన్ వీడియోల్లో నెట్ ఫ్లిక్స్ ఒకటి.. అమెరికాలో 33 శాతం మంది ఉండగా, యూకేలో 29 శాతం మంది, స్పెయిన్‌లో 28 శాతం మంది  ఉన్నారు. అమెరికాలో 2020 ఆరంభంలో కిడ్స్.. రోజుకు యూట్యూబ్ లో 2019లో 88 నిమిషాలు గడపగా.. ఇప్పుడు 86 నిమిషాలకు తగ్గింది. యూకేలో కిడ్స్ రోజుకు 2019లో మాత్రం 77 నిమిషాలు మాత్రమే వీక్షించగా.. ఇప్పుడు 75 నిమిషాలకు తగ్గింది. ఇక స్పెయిన్‌లో కూడా కిడ్స్ రోజుకు 2019లో 66 నిమిషాలు మాత్రమే చూస్తుండగా.. ఇప్పుడు రోజుకు 63 నిమిషాలకు తగ్గినట్టు నివేదిక తెలిపింది. కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ వీడియోలను వీక్షించేవారి సంఖ్య అధికమైందనే ఊహించవచ్చు. అమెరికాలో కిడ్స్ మధ్య ఏప్రిల్ నెలలో రోజుకు 99 నిమిషాలు యూట్యూబ్ చూస్తున్నారని అర్థం.  

ఈ క్రమంలో టిక్ టాక్ పై కిడ్స్ గడిపే నిమిషాల సమయం ఎక్కువగా పెరగడంతో మొత్తం యూట్యూబ్ నిమిషాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గత ఏడాదిలో టిక్ టాక్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్ లోడ్ అయిన టాప్ ఐదు యాప్స్ లో ఒకటిగా నిలిచింది. మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 ద్వారా అమెరికాలో రోజుకు సగటున కిడ్స్ టిక్ టాక్‌లో గడిపే సమయం 116 శాతానికి పెరిగింది. తద్వారా 82 నిమిషాలకు చేరింది. యూకేలో 97 శాతానికి 69 నిమిషాలకు చేరింది. అదే స్పెయిన్ లో 150 శాతం పెరిగి వీక్షించే సమయం 60 నిమిషాలకు చేరింది. ఫిబ్రవరి 2020లో అమెరికలో టిక్ టాక్ ను కిడ్స్ 16.5 శాతం వాడారు. ఇన్ స్టాగ్రామ్ కు 20.4 శాతంతో వెనుకబడి మరో యాప్ స్నాప్ చాట్ కు 16శాతంతో ముందుంజలో ఉంది. యూకేలో, స్పెయిన్ లో 17.7శాతం, 37.7శాతం పిల్లలు టిక్ టాక్ ఎక్కువగా వాడుతున్నారు.