Delhi : ఢిల్లీ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు చెప్పిన నిందితుడు
ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్యోదంతం సంచలనం కలిగించింది. నిందితుడు సాహిల్ పోలీసుల విచారణలో షాక్‌కి గురి చేసే అంశాలను బయటపెట్టాడు. పైగా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు.
- Lakshmi 10tv
- Published On : May 30, 2023 / 01:22 PM IST
delhi
Delhi Murder : ఆదివారం ఢిల్లీలో జరిగిన బాలిక హత్య కేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే ఈ కేసులో నిందితుడు చెబుతున్న అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి.
ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను 20 ఏళ్ల యువకుడు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 22 సార్లు కత్తితో పొడిచి, బండరాయితో క్రూరంగా చితకబాదిన ఘటనలో ఆమె చనిపోయింది. అయితే ఈ కేసుకి సంబంధించిన విచారణలో నిందితుడు సాహిల్ చెబుతున్న అంశాలు పోలీసులను సైతం షాకికి గురి చేస్తున్నాయి. సంఘటన జరిగిన రాత్రే పోలీసులు అతడిని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. అయితే అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు.
Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో
ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌కి చెందిన సాహిల్ ఏసీ రీపేర్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. అతను బాలికతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడట. అయితే ఆమె తనకు బ్రేకప్ చెప్పి మాజీ ప్రియుడితో చనువుగా ఉంటోందని.. తనను పట్టించుకోకపోవడం కోపం తెప్పించదని పోలీసుల విచారణలో చెప్పాడు. అందుకే తను నేరం చేసినట్లు సాహిల్ అంగీకరించాడు.
మద్యం మత్తులో సాహిల్ బాలికపై దాడికి తెగబడ్డాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడి కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్తున్న ఆమెను అడ్డగించి కత్తితో పొడిచాడు. సీసీ ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం బాలికను పదే పదే పొడిచి తన్నడం.. బండరాయిని తీసుకుని ఆమె తలను పగలగొట్టడం. అటువైపుగా వెళ్తున్న జనం దాడిని చూసినా ఆపడానికి ప్రయత్నించకపోవడం షాక్‌కి గురి చేసింది.
Delhi Woman : 2006లో కిడ్నాపైన మహిళ.. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షం
పోలీసులు వచ్చేవరకు ఆమె మృతదేహం 25 నిముషాలపాటు రోడ్డుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరంపై 34 గాయాలతో పాటు పుర్రె పగిలిపోయిందని పోలీసులు చెబుతున్నిరు. కత్తిని అక్కడే పడేసిన నిందితుడు బులంద్‌షహర్‌కు బస్సెక్కి వెళ్లిపోయి తన అత్త ఇంట్లో దాక్కున్నాడు. హత్య జరగడానికి ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
