Kl Rahul
KL Rahul: ప్రముఖ క్రికెటర్ కేఎల్.రాహుల్ కోవిడ్ బారిన పడ్డారు. బెంగళూరులో ఉన్న రాహుల్, తనకు కోవిడ్ సోకినట్లు బీసీసీఐకి తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి విషయాన్ని తెలియజేశారు. రాహుల్ త్వరలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. చాలా కాలం తర్వాత ఈ టూర్ ద్వారా ఆయన అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడుతున్నారు.
Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం
అయితే, ఆయన కోలుకున్న తర్వాతే ఈ టోర్నమెంటులో ఆడాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత నుంచి ఆయన క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాల్సి ఉన్నప్పటికీ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది. జర్మనీ వెళ్లి గాయానికి చికిత్స తీసుకుని వచ్చిన రాహుల్… తిరిగి వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమయ్యేలోపే కోవిడ్ బారిన పడ్డాడు. ఈ నెల 29 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తిరిగి టోర్నిలో ఆడే అవకాశం ఉంది.
Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి
మరోవైపు రాహుల్‌తోపాటు రవీంద్ర జడేజా కూడా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. మోకాలి గాయం కారణంగా జడేజా టోర్నీలో ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై ఇంకా వైద్యబృందం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ టోర్నీకి జడేజా వైస్-కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది.