Kohli And Babar
Kohli: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ (16) రాణించలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. రెండో వన్డేలో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 247 పరుగుల టీమిండియా ఛేదించలేకపోయింది. భారత్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్‌మన్ కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోలేకపోయాడు. టీ20ల్లోనూ అతడి ఆటతీరు బాగోలేదు. దీంతో ఆయన ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు.
”కోహ్లీ ఎన్నో మ్యాచులు ఆడాడు. ఎన్నో ఏళ్ళుగా ఆడుతున్నాడు. అతడు గొప్ప బ్యాట్స్‌మన్.. అతడికి కొత్తగా మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌లో ఒక్కోసారి ఫాంలో ఉంటాం.. ఒక్కోసారి ఫాంను కొనసాగించలేం. మరో రెండు, మూడు ఆటలు ఆడితే కోహ్లీ మళ్ళీ పుంజుకుంటాడు. క్రికెట్‌ను ఫాలో అయ్యే వారు కూడా కోహ్లీ గురించి నాలాగే ఆలోచిస్తారని అనుకుంటున్నాను” అని రోహిత్ శర్మ చెప్పాడు. కోహ్లీ ఆటతీరుపై పాక్ కెప్టెన్ బాబర్ అజాం స్పందిస్తూ… ”ఒడిదుడుకులు సహజం.. ధైర్యంగా ఉండు.. #విరాట్‌కోహ్లీ” అని ట్వీట్ చేశాడు.