Telangana Rashtra Samithi: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడులో తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ కు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తమ పార్టీ నేతలతో కేసీఆర్ కాసేపు మాట్లాడి పలు సూచనలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం కృషి చేసిన నేతలను కేసీఆర్ అభినందించారు. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలును మొదలుపెట్టాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి సూచనలు చేశారు.
మరోవైపు, బీజేపీ నేతలు కూడా తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో సమావేశమయ్యారు. మునుగోడులో తమ పార్టీ ఓటమిపై సమీక్ష జరుపుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఇక ప్రధాన పార్టీలు అన్నీ తదుపరి ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..