నేను బాగానే ఉన్నా : డైనమిక్ లీడర్ కేటీఆర్

  • Publish Date - May 12, 2020 / 08:58 AM IST

నేను బాగానే ఉన్నానంటూ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మంత్రి కొట్టిపారేశారు. ఈ మేరకు 2020, మే 12వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ ఉందని, సిరిసిల్లలో సోమవారం పర్యటనలో ఇబ్బంది ఎదురైందని, ఎవరికీ ఇబ్బంది కలుగద్దనే ఉద్దేశ్యంతో తాను పర్యటనను కొనసాగించాల్సి వచ్చిందన్నారు. కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిపై జి. సుబ్రమణ్య శాస్త్రీ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. 
 

Read More : 

ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు… సీజనల్‌ వ్యాధుల నివారణకు తెలంగాణలో కొత్త కార్యక్రమం

* మరోదారి లేదు, అప్పటివరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే