Ktr
KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) శనివారం ఉదయం ప్రగతిభవన్ లో కిందపడ్డారు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైంది. వైద్యులు పరీక్షించి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Minister KTR Leg Fracture : మంత్రి కేటీఆర్ కాలికి గాయం-మూడు వారాలు విశ్రాంతి
కేటీఆర్ ట్వీట్ కు అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఓటీటీ వెబ్ సిరీస్ ల పేర్లను చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కేటీఆర్ ట్విటర్ ను ఫాలో అయ్యేవారు తమ సలహాలను ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రయన్.. వైల్డ్ వైల్డ్ కంట్రీ, స్కామ్ 1992 సిరీస్ లు చూడాలంటూ సూచించారు.
Quick recovery, Ram.
Watch Wild Wild Country.
Scam 1992.— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) July 23, 2022
అదేవిధంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓ నెటిజన్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ ను వీక్షించండి అంటూ సలహా ఇచ్చాడు. మాస్, కింగ్ డం సీజన్ -1, 2 కొరియన్ సిరీస్ ల ను వీక్షించండి కేటీఆర్ సర్ అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ఇలా అనేక మంది నెటిజన్లు తమకు నచ్చిన సిరీస్ పేర్లను చెబుతూ వీటిని చూడండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
Panchayat series In Amazon prime
— Sharath Chandra (@sharathjagruthi) July 23, 2022
మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. తన అధికారిక ఖాతా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, తన ప్రోగ్రాంలకు సంబంధించిన కార్యక్రమాలను తెలుపుతుంటారు.