Warangal: భవనం ప్రహరీ గోడ కూలి ఇద్దరు కూలీల మృతి

వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

Dead Body Legs

Warangal: వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఎంజీఎంకి తరలించారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కూలీలు న‌లుగురూ వరంగల్ ఎనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్‌కి చెందిన వారు. మృతి చెందిన వారి పేర్లు ప్రకాశ్‌ (32), సునీత (30)గా పోలీసులు గుర్తించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వారి పేర్లు జ్యోతి (30), శ్రీను (40) అని చెప్పారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంద‌ని చెప్పారు. భవనం ప్రహారీ గోడ కూలిన ప్రాంతంలో పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.