Bihar : ఆర్జేడీ కార్యాలయంలో 6 టన్నుల లాంతర్‌..లాలూ చేతుల మీదుగా ఆవిష్కరణ?..

బీహార్ లోని ఆర్జేడీ కార్యాలయంలో ఆ పార్టీ గుర్తు అయిన 6 టన్నుల లాంతర్‌ ని ఏర్పాటు చేశారు. ధీన్ని లూలూ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని పార్టీ భావిస్తోంది.

Lalu Prasad can inaugurate 6 ton lantern: బీహార్ రాజధాని పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో పార్టీ గుర్తు అయిన భారీ లాంతరు ఏర్పాటు అయ్యింది. 6 టన్నులకుపైగా బరువున్న లాంతరుని త్వరలో ఏర్పాటు చేశారు. భారీ స్కామ్ లో ఇరుక్కుని జైలుపాలు అయినా లాలూపై అభిమానులకు ఏమాత్రం అభిమానం తగ్గలేదు. తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఇప్పటికీ పార్టీ కార్యకర్తలు అభిమానిస్తునే ఉంటారు.

పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో ఆర్జేడీ పార్టీ గుర్తు 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత..బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో లాంతరుని ఏర్పాటు చేసిన ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్‌ని లాలూ రబ్రీదేవిల కుమారుడైన తేజస్వి యాదవ్ చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు.

Read more : Lalu Prasad Yadav : సాగు చట్టాలు రద్దు చేసారు సరే..మరణించిన 700మంది రైతుకుటుంబాల సంగతేంటీ? : లాలూ ప్రసాద్

బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన కుంభకోణం సంబంధించిన కేసు విషయంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. లాంతరు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

Readmore : International Democracy : ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయి..64 శాతం దేశాల్లో ఇదే పరిస్థితి

ట్రెండింగ్ వార్తలు