Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.

Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది.

India vs Newzealand Match: రెండోవన్డేకు సంజూశాంసన్‌ను ఎందుకు తీసుకోలేదో చెప్పిన కెప్టెన్ శిఖరధావన్

సింగపూర్‌లో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగనుంది. దీనికోసం ఆయన శనివారం సింగపూర్ చేరుకున్నారు. రోహిణి అక్కడే ఉంటున్నారు. సింగపూర్ చేరుకున్న తండ్రికి, రోహిణి ఆచార్య ఆత్మీయ స్వాగతం పలికారు. తండ్రిని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టు చేరుకున్న రోహిణి, వీల్ చైర్‌పై కూర్చున్న తండ్రి పాదాలకు నమస్కరించింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 74 ఏళ్ల వయసున్న లాలూకు ఆయన కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు ముందుకు రావడం అందరి మనసుల్ని గెలుచుకుంది. రోహిణి నిర్ణయానికి ప్రశంసల వర్షం కురిసింది.

Mumbai Measles : ముంబైలో కొత్తగా 32 మీజిల్స్‌ కేసులు

కిడ్నీ దానానికి సిద్ధ పడటమే కాకుండా.. శస్త్ర చికిత్స కోసం వచ్చిన తండ్రి పాదాలకు నమస్కరించడం చూసి రోహిణిని నెటిజన్లు మరింత ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ విషయానికి రోహిణి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తను కిడ్నీ దానం చేయడం చాలా చిన్న పని అని రోహిణి చెప్పింది. తను ఇస్తోంది ఒక మాంసపు ముద్ద మాత్రమే అని చెప్పింది. తన తండ్రి లాలూ కోలుకుని ప్రజల తరఫున నిలబడతారని ఆమె వ్యాఖ్యానించింది.

 

ట్రెండింగ్ వార్తలు