Vehicles Stranded: హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన వెయ్యి వాహనాలు

జమ్ము-కాశ్మీర్‌లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో అధికారులు వాటిని తొలగిస్తున్నారు.

Vehicles Stranded: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై గురువారం ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో అనేక చోట్ల రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇరుపక్కలా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు వెయ్యికిపైగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

అమర్‌నాథ్ యాత్రికుల కాన్వాయ్ కూడా ఈ ట్రాఫిక్‌లోనే చిక్కుకుంది. ఇది దాదాపు 270 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి. కాశ్మీర్‌ను, దేశంలోని అనేక ప్రాంతాలను కలిపే రహదారి ఇదే. ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పెద్దపెద్ద రాళ్లు రహదారిపై పడ్డాయి. దీంతో రెండు వైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి మధ్యలో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను చందర్‌కూట్, నాష్రి వద్ద నిలిపివేశారు. వీరికి అక్కడే తాత్కాలిక వసతి కల్పించారు.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

మరోవైపు అధికారులు రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రొక్లైనర్లు, జేసీబీలతో రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. దీంతో రవాణకు అంతరాయం ఏర్పడుతుంది. గత మే నెలలో కూడా రాంబన్ జిల్లాలో ఇలాగే ట్రాఫిక్ స్తంభించింది. నిర్మాణంలో ఉన్న ఒక టన్నెల్ కూలడంతో పది మంది కూలీలు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు