Leopard Attacks : అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు, క్రూర జంతువులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అడవుల్లో చెట్టు నరికేయడం, నీళ్లు లేకపోవడం, ఆహారం దొరక్కపోవడం వంటి కారణాలతో.. క్రూర జంతువులు మనుషుల మధ్యకు వస్తున్నాయి. మనుషులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా కర్నాటకలోని మైసూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. రోడ్డెక్కిన చిరుత… మనుషులపై దాడి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని గాయపరిచింది. చిరుత దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ చిరుత పులి జనాల్లోకి వచ్చేసింది. స్థానికులను హడలెత్తించింది. ఇక్కడి కనక నగర్ లో ఒక్కసారిగా ఇది ప్రవేశించింది. శుక్రవారం ఉదయం చిరుతను చూసిన స్థానికులు భయంతో చెరో దిక్కుకు పరుగులు తీశారు. చిరుత దాడి భయంతో పరుగులు తీసిన వారిలో కొందరు కిందపడి గాయపడ్డారు. కొందరిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. చిరుత సృష్టించిన బీభత్సం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రోడ్డుపై బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి చేయడం వీడియోలో ఉంది. అతడు రోడ్డుపై పడిపోయాడు. చిరుత దాడిలో గాయపడ్డాడు. ఇంతలో మరో వ్యక్తి కేకలు పెడుతూ చిరుతను తరిమే ప్రయత్నం చేశాఢు. చిరుత ఎదురు తిరిగింది. అతడి వెంటపడి దాడి చేసి గాయపరిచింది. ఇలా కనిపించిన వారిపై అది దాడికి పాల్పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
#WATCH | Karnataka: A leopard entered the Kanaka Nagar of Mysuru & attacked some people, he was later captured & rescued by the forest department pic.twitter.com/yVBIcfOyxM
— ANI (@ANI) November 4, 2022