Sadhguru Jaggi Vasudev : పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే నడిచి వెళ్లండీ..

పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే ఆఫీసులకు..మీపనుల మీద బయటకు వెళ్లేవారు నడిచి వెళ్లండీ..కాలుష్యం పిల్లల ఆనందాలకు ఆటంకం కారాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు

Sadhguri Jaggi Vasudev

Sadhguru Jaggi Vasudev : దీపావళి బాణసంచా కాలిస్తే కాలుష్య పెరిగిపోతోందని..కాబట్ట బాణసంచా కాల్చటంపై ఆంక్షలు వస్తున్నాయి. కోర్టులే దీనికి సంబంధించి సూచనలిస్తున్నాయి. దీంతో దీపావళి సందడి లేకుండానే కామ్ గా వెళ్లిపోతోంది. ఈక్రమంలో ‘‘ఆధ్యాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్ దీపావళి పండుగ రోజున పిల్లల ఆనందాన్ని దూరం చేయొద్దు..పిల్లల్ని క్రాకర్స్‌ కాల్చనివ్వండి. వారి ఆనందానికి ఎయిర్‌ పొల్యూషన్‌ అడ్డంకి కాకూడదని అన్నారు.

వాయు కాలుష్యానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి కానీ..టపాసులపై నిషేధం విధించడం సరైంది కాదని అన్నారు. అంతేకాదు బాణసంచా నిషేధానికి మద్దతుగా నిలిచిన వ్యక్తులకు సద్గురు ఓ సలహా కూడా ఇచ్చారు. వాయు కాలుష్యం గురించి ఆలోచించే మీరు ఒక చిన్న త్యాగం చేయమని.. వారంలో ఒక మూడు రోజులు మీ ఆఫీసుకి నడిచి వెళ్ళండి అని చెప్పారు. దీపావళికి మీ ఫ్యామిలీ, పిల్లలతో కలిసి పటాకులు పేల్చి ఆనందించండని కోరారు. పిల్లలు క్రాకర్స్ కాలుస్తుంటే వారి కళ్లల్లో వేయి మతాబుల వెలుగులు చూసి ఆనందించండీ అని సూచించారు. ఈ సహాలను సద్గురు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Read more : Diwali Day : దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటుండదా!…

ఈ సందర్భంగా సద్గురు నేను చాలా సంవత్సరాలుగా క్రాకర్‌ని వెలిగించడం లేదని..చిన్నతనంలో దీపావళి వస్తుందంటే… బాణాసంచా కోసం ఒక నెల ముందు నుంచి హడావిడి చేసేవారమని తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. దీపావళి పండగ తరువాత కూడా ఆ ఆనందం నెలలు ఉండేదని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. దీపావళికి కొన్న బాణాసంచా రెండు నెలలు వరకూ దాచి.. వాటిరోజు చూస్తూనే సంతోషపడిపోయేవారం అని తనదైన శైలిలో చిరుదరహాసంతో తెలిపారు సద్గరు. అలనాటి బాల్యానికి ఆ మధుర జ్ఞాపకాలను దూరం చేయొద్దంటూ సద్గురు సూచించారు.

కాగా..దీపావళి పండుగ. చిన్నవారికే కాదు పెద్దలకు కూడా ఆనందాల వేడుక. బాణసంచా కాల్చేవారికే కాదు చూసే వారికి కూడా ఆనందాన్నిచే పండుగు. చిన్నప్పుడు దీపావళి వస్తోదంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలైపోయేది.ముఖ్యంగా గ్రామాల్లో సొంతంగానే పటాకులు తయారు చేసుకునేవారు. వెలుగులు చిందే మతాబులు, తుర్రుముంటూ దూసుకుపోయే సిసింద్రీలు, ఇలా వెలిగిస్తే చాలా అలా ఆకాశంలోకి దూసుకుపోయే తారజువ్వలు, పటాకులు ఇలా చాలా వరకు ఇంట్లోనే తయారు చేసుకునేవారు.

Read more : Diwali : దీపావళిరోజు ఆడపడుచులు హారతి ఇవ్వటం వెనుక అసలు కధేంటంటే?…

ముఖ్యంగా సిసింద్రీలు తయారు చేసుకోవటానికి కావాల్సిన తుమ్మచెట్టు బొగ్గు కోసం మగపిల్లలు చెట్టు కొమ్మలు నరికి వాటిని ఎండబెట్టి కాల్చి బొగ్గు తయారు చేసి మరీ సిసింద్రీలు పోటీలు పడి మరీ సిసింద్రీలు తయారుచేసుకునేవారు. అటువంటిది రోజులు మారాయి. కాలుష్యం పేరుతో దీపావళి వెలుగులు మసకబారిపోతున్నాయి. చిన్నపిల్లలు దీపావళి సంబరాన్ని అనుభవించకుండానే..వారికి ఆ ఆనందం తెలియకుండాపోతోంది. కానీ ఏ సమస్యకైనా ప్రత్యామ్నాయాలు ఉన్నట్లే కాలుష్యం తగ్గించాలని పాలకులు చిత్తశుద్ధితో సంకల్పించుకుంటే కాలుష్యం మటుమాయం అవుతుంది. అలనాటి దీపావళి వెలుగులు మళ్లీ తేజరిల్లుతాయి. చిన్నారుల కళ్లల్లో కోటి దీపాల వెలుగులు వెదజల్లేలా పాలకులు కాలుష్యం నివారించటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది.