Puri Jagannadh: పూరీకి లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ వార్నింగ్.. స్పందించిన వర్మ!

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి చేసిన సినిమా "లైగర్". ఈ సినిమాను పూరీ కనెక్టస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోవడంలో మాత్రం విఫలమయ్యింది. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ పూరీకి ఫోన్ చేసి...

Liger Distributors Threating Call to Puri Jagannadh

Puri Jagannadh: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి చేసిన సినిమా “లైగర్”. ఈ సినిమాను పూరీ కనెక్టస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోవడంలో మాత్రం విఫలమయ్యింది.

Puri Jagannadh : ఆటో జానీ సినిమాపై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాధ్

డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టాలు బాట పట్టారు. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ పూరీకి ఫోన్ చేసి ధర్నా చేస్తామని బెదురుస్తున్నారట. ఇక సహనం కోల్పోయిన డైరెక్టర్ వారికీ దిమ్మ తిరిగేలా బదులిచ్చాడు. అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఆ ఆడియోలో పూరీ.. “ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఒక నెలలో అగ్రీ ఐన అమౌంట్ ఇస్తా అని చెప్పను. ఇస్తాను అని చెప్పాక కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను” ఇవ్వనంటూ బదులిచ్చాడు.