Mahabubnagar: ఊరిలో గాయాలతో చిరుత..

ఓ చిరుత కాళ్ళకి బలమైన గాయాలతో ఊరిలో ప్రత్యక్షమైంది. నడవలేని స్థితిలో పడిఉన్న చిరుతను చూసిన స్థానికులు అటవీశాఖకు సమాచారమివ్వడంతో చేరుకున్న అధికారులు చిరుతను బంధించి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Mahabubnagar

Mahabubnagar: ఓ చిరుత కాళ్ళకి బలమైన గాయాలతో ఊరిలో ప్రత్యక్షమైంది. నడవలేని స్థితిలో పడిఉన్న చిరుతను చూసిన స్థానికులు అటవీశాఖకు సమాచారమివ్వడంతో చేరుకున్న అధికారులు చిరుతను బంధించి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో ఓ చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది.

Mahabubnagar

బూరుగుపల్లి శివారులో ముందుగా చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఉన్న స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు గాయపడిన చిరుతను బోనులో బంధించి హైదరాబాద్‌ తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, చిరుత గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తిరగబడి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు చెప్తున్నారు.