ఏపీలో లాక్‌డౌన్ కొత్త గైడ్‌లైన్స్ 

  • Publish Date - May 14, 2020 / 07:23 AM IST

లాక్ డౌన్‌లో మరిన్ని మినహాయింపులనిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుకోవచ్చునని తెలిపింది. షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్సులు, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో  షాపులు తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో ఉన్న షాపులు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న షాపులను తెరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనుమతినిచ్చింది.

వస్త్ర, నగల, చెప్పుల షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. పట్టణాల్లో సర్వీసు విధానాల్లో షాపులు తెరిచేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. అతి తక్కువ పాజిటివ్ కేసులున్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర సరకుల షాపులు మాత్రమే తెరిచి ఉండేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షాపుల ముందు భౌతిక దూరాన్ని పాటించాలని, గ్రౌండ్ మార్కింగ్ చేయాలని సూచించింది. 

వినియోగదారులు, అమ్మకం దారులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మార్గదర్శకాల్లో సూచించింది. షాపుల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని  షాపులను చెప్పేంత వరకు తెరవకూడదని ఆదేశించింది. తెరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. 

Read More:

ఏపీలో 24 గంటల్లో 36 కరోనా కేసులు 

1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం జీవో