Crocodile – Lions fight: వైరల్ వీడియో: మూడు సింహాలపై పోరాడిన మొసలి

చెరువు ఒడ్డుకు వచ్చిన ఒక మొసలిపై మూడు సింహాలు దాడికి దిగిన ఘటనలో.. ఆ మొసలి సింహాలపై తిరగబడి తనని తాను రక్షించుకుంది

Lions

Crocodile – Lions fight: నీటిలో మొసలి ఎంత బలంగా ఉంటుందో మనం అనేకసార్లు విన్నాం. అదే విధంగా భూమిపై సింహాలు, పులులు ఎంత బలం కలిగి ఉంటాయో కూడా తెలుసు. అయితే నీరు ధాటి ఒడ్డుకు వచ్చిన మొసలి తన పోరాటపటిమను కోల్పోతుంది. అదేవిధంగా నీటిలోకి వెళ్లే ఇతర జంతువులు కూడా స్వీయ రక్షణకు కూడా దిగలేవు. అయితే ప్రాణాపాయం ఎదురైనపుడు మాత్రం పోరాటం అనివార్యం కాగా..ఎటువంటి పరిస్థితుల్లోనైనా బల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. చెరువు ఒడ్డుకు వచ్చిన ఒక మొసలిపై మూడు సింహాలు దాడికి దిగిన ఘటనలో.. ఆ మొసలి సింహాలపై తిరగబడి తనని తాను రక్షించుకుంది.

ఆ వీడియోలో ముందుగా ఒక సింహం..మొసలిపై దాడికి దిగింది. ఆ దాడి నుంచి రక్షించుకునేందుకు మొసలి ప్రయత్నిస్తుండగానే..వెనుక నుంచి వచ్చిన మరో రెండు సింహాలు.. \మొసలిపై దాడి చేశాయి. దీంతో మొసలి ఆ మూడు సింహాలపై తీవ్రంగా పోరాడింది. లయన్స్ డైలీ(Lions Daily_ ) అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజెన్లు మొసలి తిరుగుబాటుపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయంటే..కొన ఊపిరి వరకు పోరాడాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

other stories: Viral video: 13ఏళ్ల క్రితం తన జుట్టును తాకిన యువకుడితో మాట్లాడిన ఒబామా.. వైరల్ అవుతున్న వీడియో..