Love Is Blind: 70 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల యువతి.. పెళ్లి కూడా చేసుకున్న ప్రేమ జంట!
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ప్రేమ కథ కూడా అలాంటిదే. 70 ఏళ్లు వృద్ధుడిని, 19 ఏళ్ల యువతి ప్రేమించి, పెళ్లి చేసుకుంది.
- Narender Thiru
- Published On : November 21, 2022 / 07:57 PM IST
Love Is Blind: ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలా మంది నిరూపించారు. తమకంటే వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకున్న వారు ఎందరో! అయితే, సాధారణంగా ఇలాంటి జంటల మధ్య ఏజ్ గ్యాప్.. ఐదేళ్లు.. పదేళ్లు.. మరీ ఎక్కువ అంటే ఇరవై ఏళ్లు ఉండొచ్చు.
India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?
కానీ, ఇద్దరికీ 51 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటే? నిజంగా నమ్మలేరు కదూ. కానీ, ఇటీవలే పెళ్లి చేసుకున్న ఒక జంటకు వయసు తేడా 51 ఏళ్లు ఉంది. అలాగని వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. బలవంతపు పెళ్లి అసలే కాదు. లవ్ మ్యారేజ్! అందులో అమ్మాయి వయసు 19 ఏళ్లు. ఆయన వయసు 70 ఏళ్లు. ఇద్దరి మధ్యా 51 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ పెళ్లి జరిగింది ఇండియాలో కాదు. పాకిస్తాన్‌లో. వీరి ప్రేమ కథ మొదలైంది లాహోర్‌లో. 70 ఏళ్ల లియాకత్ అలీ.. 19 ఏళ్ల షుమైలా ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లేవాళ్లు. అలా రోజూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ క్రమంలో ఒక రోజు షుమైలా పాట పాడుతూ వాకింగ్ చేసింది.
Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు
ఈ పాట లియాకత్ అలీకి ఎంతగానో నచ్చింది. అప్పుడే లియాకత్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఇటీవల ఇద్దరూ పెద్దవాళ్లను ఒప్పించి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వయసుకు, ప్రేమకు సంబంధం లేదని షుమైలా చెప్పింది. మొదట తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నానని షుమైలా చెప్పింది. ప్రస్తుతం వీరి ప్రేమకథ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
