Lunar Eclipse 2022 : ఎరుపెక్కిన చంద్రుడు.. కనువిందు చేస్తున్న బ్లడ్‌మూన్

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..

Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది. తూర్పు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. మన దగ్గర మాత్రం పాక్షిక గ్రహణమే చూడవచ్చని సైంటిస్టులు చెప్పారు. బ్లడ్ మూన్ అంటే కాబట్టి చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇక సూర్యగ్రహణం చూసేందుకు అయితే ప్రత్యేక పరికరాలు అవసరం కానీ చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని చెప్పారు. కాగా, ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం.

భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ వర్ణంలో
కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మంగళవారం చంద్ర గ్రహణం ముగిసిందంటే మళ్లీ కనిపించేది 2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

”చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పండితులు ఏం చెబుతున్నారు అంటే.. స్నానం, జపం, హోమం, దానం.. చంద్రుడు, సూర్యుడు ఆధ్యాత్మిక దేవతలు. వారి వల్లనే మనం చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం.

Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం.. కొనసాగుతున్న చంద్రగ్రహణం, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 2025లోనే

చంద్రుడు, సూర్యుడు లేనిదే లోకం లేదు. పట్టు స్నానం చేయాలి. ముఖ్యంగా గర్భిణిలు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో కడుపులో ఏ విధమైన పదార్ధం ఉండకూడదు. గ్రహణం శక్తి వల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రహణం సయమానికి నాలుగైదు గంటల ముందే తినేయాలి. గ్రహణం వీడిన తర్వాత స్నానాలు చేయాలి. ఇల్లు శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాతే ఆహారం తీసుకోవాలి” అని పండితులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు