Viral Video: గోడను ఢీ కొన్న బస్సు.. గోడ తనపై పడడంతో బాలుడి మృతి

ఓ బాలుడు (11) బస్టాండ్ వద్ద నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ బస్సు వెనకకు వస్తున్న సమయంలో అక్కడున్న గోడను ఢీ కొట్టింది. దీంతో గోడ కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: ఓ బాలుడు (11) బస్టాండ్ వద్ద నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ బస్సు వెనకకు వస్తున్న సమయంలో అక్కడున్న గోడను ఢీ కొట్టింది. దీంతో గోడ కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని పాల్ఘర్ లోని జవహర్ బస్ డిపో వద్ద చోటుచేసుకుంది. బస్సును డ్రైవర్ వెనకకు తీసుకువస్తున్న సమయంలో అది గోడకు తగిలింది. గోడకూలి బాలుడిపై పడింది. గోడను పైకి లేపి అతడిని రక్షించడానిక స్థానికులు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి.

గోడకూలిన ఘటనలో మరో 15 ఏళ్ల బాలుడి కాలికి గాయమైంది. ఆ బాలురు తమ బంధువులను కలవడానికి జవహర్ ప్రాంతానికి వచ్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..