Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!

మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.

Godse-Apte Memorial Day : జనవరి 30. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేసిన గాంధీజికి యావత్ భారతదేశం నివాళులు అర్పించింది ఆయన (ఆదివారం) జనవరి 30 ఆయన 74వ వర్థంతి రోజున. కానీ హిందూ మహాసభ మాత్రం దీనికి తీవ్ర విరుద్ధంగా వ్యవహరించింది. గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేకి గాంధీజీ వర్థంతి రోజునే ఘన నివాళులు అర్పించింది. అంతేకాదు గాంధీ హత్యలో గాడ్సేకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారంటున్న నారాయణ్ ఆప్టేకి కూడా హిందూ మహాసభ నివాళులు అర్పించింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ‘గాడ్సే-ఆప్టే స్మృతి దివస్’ పేరిట సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విరుద్ధ వ్యవహారాలను నిర్వహించింది హిందూ మహాసభ.

కాగా గత ఏడాది డిసెంబర్ లో ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని ధర్మ సంసద్ లో గాంధీని కించపరుస్తు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో మత నాయకుడు కాశీ చరణ్ మహారాజ్ కు గాడ్స్ ఆప్టే భారత రత్న అంటూ కొనియాడి ఆ బిరుదును ఇచ్చారు మహా సభ నాయకులు. ఈ క్రమంలో మరోసారి గాంధీ వర్థంతి రోజునే గాడ్సేకు నివాళులు అర్పించి మరోసారి వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించింది హిందూ మహాసభ.

ఈ సందర్భంగా హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..జనవరి 30వ తేదీని తాము గాడ్సే-ఆప్టే స్మృతి దివస్ గా జరుపుకుంటున్నామని..1948 జనవరి 30న గాడ్సే, ఆప్టే అరెస్ట్ చేశారని..దానికి నిరసనగా తాము స్మృతి దివస్ ను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. భారత్ ను పాకిస్థాన్ తో ఏకీకృతం చేసి అఖండ భారత్ గా మార్చాలనే సంకల్పంతో మేము భార్ మాకు హారతి నిర్వహించామని తెలిపారు.

‘గాడ్సే-ఆప్టే భారతరత్న’ పేరిట కొత్త అవార్డుకు కూడా నాంది పలికింది. గత డిసెంబరులో మహాత్ముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జైలుపాలైన ఆధ్యాత్మిక నేత కాళీచరణ్ మహారాజ్, మరో నలుగురు నేతలను ఈ ‘గాడ్సే-ఆప్టే భారతరత్న’ అవార్డుతో సత్కరించినట్టు జైవీర్ భరద్వాజ్ ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు