MP Road Accident..PM Modi : మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటన

మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయంగా ప్రకటించారు.

Madhya Pradesh road accident pm modi announces ex gratia of Rs.2lakh for families of victims

Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారు జామున బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొని 11 మంది మృతిచెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమన్నారు.  అలాగే మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చర్యల్ని చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. టవేరా కారులో ఉన్న వారంతా మహారాష్ట్రలోని అమరావతి నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. టవేరా డ్రైవర్‌కు మార్గమధ్యలో నిద్రరావడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని బేతుల్‌ ఎస్పీ సిమ్లా ప్రసాద్‌ తెలిపారు. ప్రమాదంలో కారు భారీగా ధ్వంసమైంది.