Madhyapradesh Tourism Board gives offers to movie shootings
Madhyapradesh : కొన్ని రాష్ట్రాలు తమ పర్యాటక రంగాన్ని మరింత ప్రమోట్ చేయడానికి సినిమాలని తీయమని, వాటికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తామని, లొకేషన్ చార్జీలు తగ్గిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా లొకేషన్ చార్జీలు చాలా తగ్గించమని షూటింగ్స్ చేయండి అని పిలుపునిచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక ఆఫర్ ని తీసుకొచ్చింది.
మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటి రూపాయల వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని, అలాగే అక్కడ ప్రభుత్వ లొకేషన్లకు చెల్లించే సొమ్ములో 75 శాతం సైతం వెనక్కి ఇస్తామని, మధ్యప్రదేశ్ రాష్ట్రం నలుమూలలా ఎక్కడైనా సరే ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు త్వరగా ఇస్తామని తెలిపింది.
Rana Daggubati : రానాకి పాపా పుట్టిందా?? వైరల్ అవుతున్న మిహికా పోస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే??
తాజాగా మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన ప్రతి విషయం అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అలాగే షూటింగ్ పర్మిషన్స్ జారీ చేయడం మొదలుకుని, నిర్ణీత వ్యవధిలో రాయితీ అందించడం వరకు ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుందని, మధ్యప్రదేశ్ లో దేశంలో ఉన్న మరెక్కడా లేని అద్భుత సందర్శనీయ ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ ప్రోత్సాహకాల ముఖ్య ఉద్దేశ్యమని, ఇందుకోసం రూపొందించిన వెబ్ సైట్ ద్వారా అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవచ్చని ప్రకటించారు.