MAHA Release controversy: తన సినిమా విడుదల ఆపాలని కేసుపెట్టిన దర్శకుడు!

ఎక్కడైనా తన సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారని దర్శక, నిర్మాతలు కోర్టుకెక్కడం మనం చూశాం. కానీ తన సినిమా రిలీజ్ ఆపాలని ఓ దర్శకుడు హైకోర్టును ఆశ్రయించాడు.

MAHA Release controversy: ఎక్కడైనా తన సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారని దర్శక, నిర్మాతలు కోర్టుకెక్కడం మనం చూశాం. కానీ తన సినిమా రిలీజ్ ఆపాలని ఓ దర్శకుడు హైకోర్టును ఆశ్రయించాడు. అలా ఎందుకంటే నిర్మాత తనను మోసం చేశాడని దర్శకుడు ఆరోపిస్తున్నాడు. సినిమాలో కొంతభాగాన్ని తన ప్రమేయం లేకుండానే సహా దర్శకుడితో పూర్తిచేశారని.. షూటింగ్ తర్వాత చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తనకు చెప్పకుండానే చేసుకున్నారని చెప్తున్నాడు.

శింబు, హన్సిక జంటగా సుమారు నాలుగేళ్ళ క్రితం మహా అనే సినిమా మొదలైంది. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రూపొందిన ఈ చిత్రానికి యు.ఆర్.జమీల్ దర్శకుడు కాగా వి.మతియాలగన్ నిర్మాత. కొంత షూటింగ్ తర్వాత ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. వాటి నుండి తేరుకునేలోగా గత ఏడాది లాక్ డౌన్ వచ్చింది. అటు కష్టాలకు తోడు ఇప్పుడు కరోనా బెడద కూడా తోడై ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇంతలోనే ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్మాత మతియాలగన్ నిర్ణయించాడు.

కానీ, దర్శకుడు జమీల్ మాత్రం అసలు నేను సినిమా పూర్తిచేయకుండానే ఎలా రిలీజ్ చేస్తారని అడ్డం తిరిగాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండా నిలుపుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా దర్శకుడైన తనకు తెలియకుండానే అసిస్టెంట్ దర్శకుడితో సినిమాను కంప్లీట్ చేసుకొని ఎలా రిలీజ్ చేసుకుంటారని జమీల్ వాదిస్తున్నాడు. మరి ఈ విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో.. అసలు ఈ సినిమా ఇప్పుడైనా విడుదల అవుతుందా అన్నది చూడాలి.

Read: Naga Chaitanya: స్పీడ్ పెంచిన చైతూ.. ఈ ఏడాది మూడు సినిమాలు?

ట్రెండింగ్ వార్తలు