Aaditya Thackeray
Maharashtra: మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సాధించినప్పటికీ ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ సమయంలో శివసేన రెండున్నరేళ్ళ పాటు తమకు సీఎం పదవి కావాలని పట్టుబట్టడమే అందుకు కారణం. ఈ విషయాన్ని శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మరోసారి గుర్తుచేశారు.
ఇవాళ ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ… ”రెండున్నరేళ్ళ క్రితమే ఫడ్నవీస్ చెవిలో ఈ విషయం చెప్పాం. అప్పట్లో ఆయన అందుకు ఒప్పుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికలు జరిగి రెండున్నరేళ్ళు అయింది. ఇప్పుడు ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కేది” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్లాన్
శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతపై ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఇంత భద్రత అప్పట్లో ఉగ్రవాది కసబ్‌కు కూడా కల్పించలేదని ఎద్దేవా చేశారు. ముంబైలో ఇప్పటివరకు ఇంతటి భద్రత ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. ఇంతగా ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఎవరైనా పారిపోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాగా, షిండే వర్గం ఎమ్మెల్యేలు ఇవాళ విధాన్ భవన్‌కు ప్రత్యేక బస్సులో భద్రత నడుమ వచ్చారు.