Jodo yatra : రాహుల్ గాంధీ చేపట్టి నడిచిన గాంధీ మనుమడు..జోడో యాత్రలో గాంధీ, నెహ్రూల మనిమనుమళ్లు నడవటం అద్భుతమంటున్న నేతలు

రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. రాహుల్ చేయి పట్టుకుని అడుగులు వేశారు తుషార్ గాంధీ. మహాత్మాగాంధీ మనిమనుమడు..నెహ్రూ మునిమనుమడు కలిసి నడవటం చరిత్రలో అద్భతం అని అభివర్ణిస్తున్నారు నేతలు.

Jodo yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలు రాష్ట్రాలు దాటి కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రలో ఎంతోమంది రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమైన తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయా సంస్కృతి సంప్రదాయలను అనుసరిస్తూ..గౌరవిస్తు నడుస్తున్నారు.

ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం (నవంబర్ 18,2022)రాహుల్ యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. రాహుల్ చేయి పట్టుకుని అడుగులు వేశారు తుషార్ గాంధీ. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ… రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చారిత్రాత్మకమని అభివర్ణించింది. భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమని..ఇది అరుదైన ఘటన అని పేర్కొంది. వీరిద్దరూ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులుగా అభివర్ణించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు