Mahesh Babu : కృష్ణా నదిలో సూపర్ స్టార్ అస్థికలు నిమజ్జనం.. విజయవాడ చేరుకున్న మహేష్ బాబు..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో 'కృష్ణ' ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలు మధ్య నిర్వహించారు. కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి విజయవాడ చేరుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ..

Mahesh Babu arrives in Vijayawada to immerse his father Krishna's ashes in the Krishna River

Mahesh Babu : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ‘కృష్ణ’ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలు మధ్య నిర్వహించారు. కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి విజయవాడ చేరుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ.. కృష్ణా ప్రవాహ ప్రాంతమైన బుర్రెపాలెంలో జన్మించడంతో అయన అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కుటుంబసభ్యులు.

Mahesh Babu : మహేష్ అన్న రమేష్ కొడుకు, కూతురిని చూశారా..

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం మహేష్ బాబు, సుధీర్ బాబు మరియు కుటుంబసభ్యులు స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో విజయవాడ చేరుకొని హిందూ శాస్త్రీయ సంప్రదాయాలతో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేయనున్నారు. కాగా మహేష్ ఫామిలీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేష్, నిర్మాత నాగవంశీ కూడా మహేష్ వెంట వచ్చారు.

ఈ విషయం తెలియడంతో.. మహేష్ అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి మహేష్ వెంట ర్యాలీగా వస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.