Mahesh Babu: మాస్ అవతారమెత్తిన మహేష్ బాబు.. ఊగిపోతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్నట్లు....

Mahesh Babu Joins For Mass Song In Sarkaru Vaari Paata

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పేర్కొంది. అయితే ఓ పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలోని ఈ పాటను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు.

Mahesh Babu: సర్కారు వారి పాటను ముగించే పనిలో మహేష్!

దీంతో ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ పాటలో మహేష్ మాస్ అవతారంలో కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. పూర్తి మాస్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటలో మహేష్ మరోసారి తన స్టెప్స్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Mahesh Babu: తెలుగు సినిమాలు చాలంటోన్న మహేష్!

ఇక ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా, థమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.