Mahesh Babu: తెలుగు సినిమాలు చాలంటోన్న మహేష్!

ఇటీవల బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం తన తాజా చిత్రం ‘ఎటాక్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాను హిందీ హీరోనని.. సౌత్ సినిమాలు చేయనని కామెంట్ చేశాడు. ఆయన చేసిన....

Mahesh Babu: తెలుగు సినిమాలు చాలంటోన్న మహేష్!

Mahesh Babu Says Telugu Movies Are Enough

Mahesh Babu: ఇటీవల బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం తన తాజా చిత్రం ‘ఎటాక్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాను హిందీ హీరోనని.. సౌత్ సినిమాలు చేయనని కామెంట్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. అయితే జాన్ అబ్రహాం చేసిన కామెంట్స్‌కు కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు, నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఆయన చేసిన సినిమాలు ఇక్కడ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి వారికి.. సైలెంట్‌గా చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చాడు.

John Abraham: సౌత్ సినిమాలపై ‘ఎటాక్’ చేసిన హీరో.. మండిపడుతున్న ఫ్యాన్స్!

తాజాగా ఓ యాప్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న మహేష్, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన సర్కారు వారి పాట చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పిన మహేష్, ఆ తరువాత రాజమౌళితో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని.. అది పాన్ ఇండియా మూవీగా రాబోతున్నట్లు మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదని.. తెలుగులో తీసినా చాలని.. ఇప్పటికే ఇక్కడ తెరకెక్కించిన పలు సినిమాలు అక్కడి జనాలకు పిచ్చపిచ్చగా నచ్చుతున్నాయని మహేష్ అన్నారు.

Mahesh Babu: బ్రేక్ తరువాతే మాంత్రికుడికి వరం..?

తాను తెలుగు సినిమాలు చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నానంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ దర్శకనిర్మాతలు మహేష్‌ను హీరోగా పెట్టి స్ట్రెయిట్ హిందీ సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నా, మహేష్ మాత్రం తెలుగు సినిమాలే చేస్తూ తన స్టార్‌డమ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. మరి నిజంగానే మహేష్ తన కెరీర్‌లో స్ట్రెయిట్ హిందీ మూవీ చేయడా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే జాన్ అబ్రహాం చేసిన కామెంట్స్‌కు మహేష్ అల్టిమేట్ రిప్లై ఇచ్చాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.