Mahesh Babu: బ్రేక్ తరువాతే మాంత్రికుడికి వరం..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు....

Mahesh Babu: బ్రేక్ తరువాతే మాంత్రికుడికి వరం..?

Mahesh Babu Trivikram Movie After Summer Vacation

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా ఈ సినిమాతో మహేష్ మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేయడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Mahesh Babu: మహేష్‌ను వెంటాడుతున్న మే సెంటిమెంట్..?

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా లాంఛ్ చేశారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభించలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు మాత్రం లేవని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu: మహేష్ కోసం పవన్ ఫార్ములా..?

మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమాను ముందుగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ తరువాత సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీ కలిసి బయటకు వెళ్లేందుకు మహేష్ రెడీ అవుతున్నాడట. ఇక వచ్చిన తరువాతే త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో త్రివిక్రమ్-మహేష్ కాంబోలో రాబోయే సినిమా షూటింగ్ ఇక మహేష్ బ్రేక్ నుండి వచ్చాకే అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.