Mahesh Babu: మహేష్ కోసం పవన్ ఫార్ములా..?

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

Mahesh Babu: మహేష్ కోసం పవన్ ఫార్ములా..?

Trivikram To Follow Pawan Kalyan Formula For Mahesh Babu

Mahesh Babu: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమాతో మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పక్కా కమర్షియల్ అంశాలతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!

ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వచ్చినా చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. కానీ వారి కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో తిరిగి ఈ కాంబో ఇప్పటివరకు సెట్ కాలేదు.

అయితే ఇటీవల మహేష్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని త్రివిక్రమ్ ప్రకటించడంతో ఇప్పుడు ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం వాడిన ఫార్ములాను మహేష్ కోసం వాడబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ స్క్రిప్టు అందించిన ‘తీన్‌మార్’ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్ లవ్‌స్టోరీని ఒకేసారి చూపించారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవన్ రెండు విభిన్న గెటప్స్‌లో మనకు కనిపించాడు. అయితే ఈ ఫార్ములా ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

Mahesh Babu : సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్..

ఇప్పుడు మరోసారి ఇలాంటి ఫార్ములాను త్రివిక్రమ్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఏప్రిల్ రెండో వారం నుండి ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించేందుకు ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌లు కంపోజ్ చేయనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ ఫార్ములా మహేష్ బాబుకు ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.