TG Breakfast Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం.. మెనూలో ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా..
Telangana Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘బ్రేక్ ఫాస్ట్’ పథకానికి శ్రీకారం చుట్టింది.
Telangana Schools Breakfast Scheme Launched In Selected Districts
- ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం.
- నాలుగు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక.
- మెనూలో ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా.
Telangana Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘బ్రేక్ ఫాస్ట్(Breakfast Scheme)’ (ఉదయం అల్పాహారం) పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ప్రాథమిక దశలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని కంది, పటాన్చెరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అధికారికంగా ప్రారంభమైంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి వచ్చే పిల్లలకు ఈ పథకం ఎంతో మేలు చేకూర్చనుంది.
*మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్
విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన మెనూను రూపొందించింది. ఇందులో భాగంగా ఇడ్లీ, పోషకాలతో కూడిన మిల్లెట్ (చిరుధాన్యాల) ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మాతో పాటు వాటికి నంజుకునేందుకు వీలుగా రుచికరమైన సాంబార్, చట్నీలను అందిస్తున్నారు. ఈ మెనూ ద్వారా విద్యార్థులకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యాశాఖ గట్టిగా అంచనా వేస్తోంది. ఉదయం పూట సరైన భోజనం లేక ఇబ్బంది పడే పేద విద్యార్థులు ఇకపై ఉత్సాహంగా బడికి వస్తారని, దీనివల్ల డ్రాపౌట్స్ తగ్గి, విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
