Kolusu Parthasarathy: ఏపీలో వీరికి గుడ్ న్యూస్.. రూ.50వేల నుంచి రూ.లక్ష.. మంత్రి కీలక ప్రకటన..
అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి(Kolusu Parthasarathy) వెల్లడించారు.
Minister Kolusu Parthasarathy announced up to 1 lakh additional financial assistance for house construction in ap
- అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తారు.
- పేదలకు అదనపు ఆర్థిక సాయం.
- సొంతింటి కల సాకారం కాబోతుంది.
Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేలా కూటమి ప్రభుత్వం భారీ గృహ నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి(Kolusu Parthasarathy) వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని, రాబోయే ఆగస్టు నాటికి మరో 2.70 లక్షలు, సెప్టెంబర్ నాటికి ఇంకో 1.62 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పీఎంఏవై 2.0 కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు.
Gnaneswari Missing Case: మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు..
పేదలు ఇళ్ల నిర్మాణాల కోసం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, వారికి అదనపు సాయాన్ని అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పివిటిజి వర్గాలకు రూ. లక్ష, ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.50 వేల చొప్పున అదనపు ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.3,219.75 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, దాదాపు 5.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా 2026-27లో 4.54 లక్షలు, 2027-28లో 3.90 లక్షలు, 2028-29లో 2.68 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. ఈ మొత్తం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.14,300 కోట్లను ఖర్చు చేయబోతోంది.
గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన గృహ నిర్మాణ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని, నాణ్యతతో కూడిన ఇళ్లను పేదలకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పీఎంఏవై 1.0 కింద గతంలో నిలిచిపోయిన పనులను పరుగులు పెట్టించి, 2025 నవంబర్లో ఒకేసారి 3 లక్షల మందికి, అలాగే ఈ ఏడాది మార్చిలో ఉగాది కానుకగా మరో 2.50 లక్షల మందికి సొంతిళ్లను అప్పగించామని గుర్తుచేశారు. రాబోయే నాలుగైదు నెలల్లో మరికొన్ని ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. మొత్తం మీద 2024 నుంచి 2029 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 16,63,155 ఇళ్లను నిర్మించి, రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పార్థసారథి తెలిపారు.
