John Abraham: సౌత్ సినిమాలపై ‘ఎటాక్’ చేసిన హీరో.. మండిపడుతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ స్టార్స్ తరుచూ సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసి అందరి చూపులు తమవైపుకు తిప్పుకుంటారు. అయితే దక్షిణాది ప్రేక్షకులు మాత్రం వారిని.....

John Abraham: సౌత్ సినిమాలపై ‘ఎటాక్’ చేసిన హీరో.. మండిపడుతున్న ఫ్యాన్స్!

John Abraham Controversial Comments On South Indian Movies

John Abraham: బాలీవుడ్ స్టార్స్ తరుచూ సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసి అందరి చూపులు తమవైపుకు తిప్పుకుంటారు. అయితే దక్షిణాది ప్రేక్షకులు మాత్రం వారిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి కామెంట్స్ చేసిన హీరోల సినిమాలను సైతం ఇక్కడి జనం ఆదరిస్తుంటారు. తాజాగా ఇలాంటి కామెంట్స్ చేశాడు ఓ బాలీవుడ్ హీరో. హిందీలో కండలవీరుడిగా జాన్ అబ్రహం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తనదైన పర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేశాడు ఈ హీరో.

అయితే తాజాగా ఆయన నటించిన ‘ఎటాక్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్ అబ్రహం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ సినిమా కూడా రిలీజ్ కావడం లేదని.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి భయపడి బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయని.. జాన్ మాత్రం ఎటాక్ చిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను హిందీ సినిమాల్లో నటించే యాక్టర్‌నని.. దేశంలో హిందీ సినిమానే టాప్ పొజిషన్‌లో ఉందని.. మిగతా ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా కూడా టాప్ స్థానాన్ని దక్కించుకోలేదని ఆయన అన్నారు.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

అంతేగాక తాను హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తానని, రెమ్యునరేషన్ కోసమో, మరే ఇతర కారణంగానో తాను దక్షిణాది చిత్రాల్లో నటించబోనని చెప్పుకొచ్చాడు. జాన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. బాలీవుడ్ సినిమాలను అక్కడే రిలీజ్ చేసుకోక మరి దక్షిణాదిన ఎందుకు రిలీజ్ చేస్తున్నారని.. ఇక్కడి జనం చూడకపోతే వారి సినిమాలకు కనీస వసూళ్లు కూడా రావని సౌత్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టిస్తుందని, ఈ సినిమా దెబ్బకు జాన్ నటించిన ఎటాక్ చిత్రం ఏమాత్రం పోటీలో లేకుండా పోతుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా జాన్ అబ్రహం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయని చెప్పాలి.