మమతకు ఈ పరిణామం రెండోసారి, ఆరు నెలల్లోపు ఎన్నిక కాకుంటే..

మమతా బెనర్జీ బుధవారం మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ శాసనసభ ఎమ్మెల్యే కానప్పటికీ మమతా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

mamata banerjee: మమతా బెనర్జీ బుధవారం మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ శాసనసభ ఎమ్మెల్యే కానప్పటికీ మమతా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 2011 లో, మమతా మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆమె లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు.

ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేసి, బిజెపి అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో ఓటమి చెందారు. ఓడిపోయినప్పటికీ మమతా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కాని ఆరు నెలల్లో ఆమె రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ సీటు నుంచైనా ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి ఉంటుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం, ఏ వ్యక్తి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కాని ఆరు నెలల్లోపు ఏదో ఒక నియోజకవర్గం నుండి గెలవాలి.. లేదా రాష్ట్రంలో శాసనమండలి ఉంటే అందులో ఎమ్మెల్సీగా నైనా సభ్యులు అయి ఉండాలి. 2001 లో సుప్రీంకోర్టు మంత్రి లేదా ముఖ్యమంత్రి సభలో సభ్యత్వం పొందకుండా 6 నెలల తరువాత కూడా కొనసాగడాన్ని నిషేధించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంట్ సింగ్ కుమారుడు తేజ్ ప్రకాష్ సింగ్ ను మంత్రిగా చేసే విషయంలో ఈ ఉత్తర్వు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు