message in a bottle : బాటిల్‌లో పంపిన మెసేజ్ 40 ఏళ్లకు దొరికింది.. ఎక్కడ?

బాటిళ్లలో మెసేజ్‌లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.

message in a bottle

message in a bottle :  చాలామందిల బాటిళ్లలో మెసేజ్‌లు రాసి వాటిని నదుల్లో, బీచ్‌లలో విసిరివేస్తూ ఉంటారు. అవి మళ్లీ జీవితకాలంలో ఎప్పుడైనా తమని చేరతాయని నమ్ముతారు. 40 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి నదిలో విసిరిన బాటిల్ తిరిగి తనకు చేరితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించండి.

mother love : కొడుకుకి తల్లి పెట్టిన వాట్సాప్ మెసేజ్ చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్స్.. ఇంతకీ ఆమె ఏం మెసేజ్ పెట్టిదంటే?

బీచ్‌లకు వెళ్లినపుడు చాలామంది బాటిల్స్‌లో ఏదో ఒక సందేశాన్ని రాసి నీటిలో వదులుతారు. ఆ టైమ్ క్యాప్సూల్స్ తిరిగి మళ్లీ తమకు అందుతాయని భావిస్తారు. అయితే చాలా రేర్‌గా అవి కొందరికీ తిరిగి చేరిన సంఘటనలు చూసాం. తాజాగా US లోని లూసియానా రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన జెరెమీ వీర్‌కి ఓ బాటిల్ దొరికింది. అతనికి నిధుల వేట అంటే ఆసక్తి. అందులో భాగంగా పియర్ నదిలో రోయింగ్ చేస్తున్నప్పుడు అతనికి బాటిల్ దొరికింది. ఆ బాటిల్‌లో 1983 జూన్ 4 నాటి క్యాలెండర్ వెనక సైడ్‌లో రాసిన ఓ మెసేజ్ కనిపించింది. అందులో ‘నా పేరు డేవిడ్ బ్లాంక్స్.. మిస్సిస్సిపీలో ఉంటున్నాను. నా వయసు 3 సంవత్సరాలు. నా బాటిల్ దొరికితే దయచేసి నా ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయడం మర్చిపోకండి’ అంటూ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు.

WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!

ఇక ఆ ఫోన్ నంబర్‌కి వీర్ ఫోన్ చేసినపుడు డేవిడ్ బ్లాంక్స్ తల్లిదండ్రులు ఫోన్ తీసారు. వీర్‌కి తన బాటిల్‌తో పాటు మెసేజ్ దొరికిందని తెలిసి డేవిడ్ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ బాటిల్ విసిరిన టైంలో డేవిడ్ వయసు జస్ట్ మూడేళ్లు. తాను మెసేజ్ రాసేటపుడు తన కజిన్ సాయం తీసుకున్నాడట. అలాగే దానిపై సంతకం కూడా చేశాడట. అది ఇప్పుడు వీర్‌కి దొరికింది. సో.. మొత్తానికి డేవిడ్ నదిలో వదిలిన బాటిల్ వీర్‌కి దొరికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.