Bipolar Disorder
Bipolar Disorder: బైపోలార్ డిజార్డర్ పర్సన్.. ఢిల్లీ జ్యూడిషియల్ సర్వీసెస్ లో జడ్జిగా అపాయింట్ అయ్యారు. అతని ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ కారణంతో అతనిపై అనర్హత వేటు వేయలేమని చెప్పారు. మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేసిన బెంచ్.. ‘అతను జ్యూడిషియల్ ఆఫీసర్ బాధ్యతను నిర్వర్తించడని చెప్పడానికేమీ లేదు’ అని చెప్పారు.
2018లోనే ఢిల్లీ లోయర్ జ్యూడిషియరీలో జ్యూడిషియల్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేశాడా వ్యక్తి. డిజెబిలిటీస్ రిజర్వ్ కేటగిరీలోని సీట్ కోసం అప్లై చేసుకోగా.. అది 2023వరకూ వ్యాలిడిటీలో ఉంటుందని తేలింది. ముందుగా అతను న్యాయపరమైన పని నిర్వహించలేడనే కారణంతో ఆ సర్టిఫికేట్ ను చాలెంజ్ చేశారు.
‘అతను వైద్యపరంగా మెరగయ్యాడు. పైగా మెడిసిన్ తీసుకుంటుండగా.. వికాలాంగుడుగా పరిగణించలేమని’ సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుంద్రేశ్ ల ధర్మాసనం నవంబరులో మెడికల్ బోర్డుకు లేఖ పంపింది.బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ మందులు వాడుతున్నప్పటికీ నయం అయిపోయిందని చెప్పలేమని మెడికల్ బోర్డు చెప్పింది. ఈ సమస్య దీర్ఘకాలిక వ్యాధి అని స్పష్టం చేసింది కోర్టు.
…………………………………….. : విజయసేతుపతికి కోర్టు నోటీసులు..
ఆ అభ్యర్థికి ఉపశమనం ఇస్తూ.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు నేషనల్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంది.