Vijay Sethupathi : విజయసేతుపతికి కోర్టు నోటీసులు..
చెన్నై ఎయిరోపోర్టులో విజయ్‌ని చూసిన మహా గాంధీ అనే వ్యక్తి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడు. అయితే విజయ్ టీంలో ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించి తనని దూషించినట్లు.....

Vijay Sethupathi
Vijay Sethupathi : తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి అటు హీరోగానూ, విలన్ గాను, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఎయిర్‌పోర్టులో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గత నెల జాతీయ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విజయ్ నవంబర్ 2న చెన్నైకి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిరోపోర్టులో విజయ్‌ని చూసిన మహా గాంధీ అనే వ్యక్తి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడు.
అయితే విజయ్ టీంలో ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించి తనని దూషించినట్లు తెలిపాడు. ఆ తర్వాత విజయ్ టీంకు, తనకు మధ్య ఘర్షణ జరిగిందని, ఈ వాగ్వాదం అనంతరం విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ జాన్సన్ తనపై దాడి చేసినట్టు ఇటీవల మీడియాకి తెలిపాడు. అయితే కేవలం నేను దాడి చేసింది మాత్రమే విజువల్స్ బయటకి వచ్చేలా చేశారు. వాళ్ళు దాడి చేసింది దాచేసారు అంటూ మీడియా ముందు గతంలో తెలిపారు.
krithi Shetty : రెండో సినిమాకే రెచ్చిపోయిన బేబమ్మ..
తాజాగా మహాగాంధీ ఈ విషయంపై చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశాడు. విజయ్ మేనేజర్ జాన్సన్ తాను ఎలాంటి తప్పు చేయకుండానే తనపై దాడి చేశాడని, జాన్సన్ తో పాటు విజయ్ టీం తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్, అతడి మెనేజర్ జాన్సన్‌లకు చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.