Manchu Vishnu Comments on Garikapati Issue
Manchu Vishnu: ఇటీవల ఓ సభలో గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడుతుండటంతో గరికపాటి చిరంజీవి మీద సీరియస్ అయ్యారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఈ రచ్చపై చిరంజీవి స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు పడింది.
Manchu Vishnu : వేరే రాష్ట్ర నటులకు మంచు విష్ణు షాక్
ఇక ఈ వివాదంపై మా అధ్యక్షుడు మరియు నటుడు మంచు విష్ణు స్పందించాడు. “మెగాస్టార్ తో ఫోటోలు అంటే ఫ్యాన్స్ కు పెద్ద పండగ. ఫాన్స్ ను స్టార్స్ ఎప్పుడు హార్ట్ చేయం. గరికపాటి గారు అలా మాట్లాడడం బాధాకరం” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా హీరో విష్ణు నటించిన జిన్నా మూవీ విడుదలకు సిద్దమవడంతో అక్టోబర్ 16న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంది మూవీ టీం.
ఇక ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, టాలీవుడ్‌లోని మెజారిటీ కామెడీ స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు ప్రొడ్యూస్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.