Manjima Mohan and gautham karthik marriage on November 28 in chennai
Manjima-Gautham : హీరోయిన్ మంజిమా మోహన్ తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైంది. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో పలకరించింది. మంజిమా మోహన్ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం తన ప్రేమ గురించి అధికారికంగా బయటపెట్టింది మంజిమా. ఒకప్పటి స్టార్ హీరో కార్తిక్ తనయుడు గౌతమ్ కార్తీక్ తో తను ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. గౌతమ్ కూడా తమిళ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
గౌతమ్, మంజిమా కలిసి దేవరత్తమ్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాతో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్త తర్వాత ప్రేమగా మారింది. త్వరలోనే వారు పెళ్లిచేసుకోబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. తాజాగా వీరిద్దరూ నవంబర్ 28న ఒక్కటవుతున్నారు. ఈ మేరకు మీడియాకి సమాచారం అందించారు. మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ నవంబర్ 28న చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది.
Varaharoopam : ‘కాంతార’కి ఊరటనిచ్చిన కోర్టు.. వరాహరూపం ఈజ్ బ్యాక్..
తాజాగా ఈ జంట ఓ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసింది. సింపుల్ గా పద్ధతైన డ్రెస్సుల్లో ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోగా ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.