వారసులు అంటే…కొడుకులే కానీ కూతుళ్లు కాదనే భావన చాలమందిలో ఉంటుంది. వ్యాపారం నిర్వహించే దుకాణాలకు పేర్లు సన్స్..లేక బ్రదర్స్ కనిపిస్తున్నాయి. కానీ పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ మెడికల్ షాపు యజమాని…తన మెడికల్ షాపుకు పెట్టుకున్న పేరు..ఇప్పుడు వైరల్ గా మారింది. కూతుళ్లే తన వారసలని తెలియచేసేలా సైన్ బోర్డు అందర్నీ ఆకర్షిస్తోంది. ‘గుప్తా అండ్ డాటర్స్’ పేరిట ఈ బోర్డు ఉంది.
తన బిడ్డలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతను అందరూ ప్రశంసిస్తున్నారు. డాక్టర్ అమన్ కశ్యప్ గుప్తా అండ్ డాటర్స్ పేరిట ఉన్న ఈ సైన్ బోర్డును ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కొడుకుల పేర్ల మీద తెరిచిన షాపుల మాదిరిగా కాకుండా..గుప్తా అండ్ డాటర్స్ పేరిట ఉన్ మెడికల్ షాపు సైన్ బోర్డు లుథియానాలో కనిపించిందని, ఈ ప్రపంచంలో మీరు చూడాలని అనుకున్న మార్పును చూడండి అని క్యాప్షన్ పెట్టారు. ఆ తండ్రి ఆలోచనలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వేరే పేరు చూడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.